గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి.. బ్లాక్ టీ పర్​ఫెక్ట్..

👉 ఈ టీ లో కేఫిన్ తక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి కాఫీ, ఇతర టీలకు బదులుగా ప్రతిరోజూ బ్లాక్ టీని తీసుకుంటే ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

🍁 వెయిట్ లాస్ మధుమేహం, గుండె జబ్బులు, పీసీఓడీ వంటి వాటికి మూలకారణం వెయిట్ లాస్. అయితే రోజుకు ఓ కప్పు బ్లాక్‌ టీ తాగితే బరువు తగ్గడం ఈజీ అవుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేసే బ్యాక్టీరియా పెరగడానికి బ్లాక్‌ టీ దోహదం చేస్తుంది. బ్లాక్‌ టీ రెండు పేగుల్లోని బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. ఆ బ్యాక్టీరియా కారణంగా జీర్ణక్రియ రేటు పెరుగుతోంది. తద్వారా ఆరోగ్యకరంగా బరువు తగ్గే వీలుంటుంది. బ్లాక్‌ టీలోని పాలీఫినోల్స్‌ మెటబాలిజమ్‌ పెరగడానికి అవసరమయ్యే బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతుంది. బ్లాక్ టీలో కొవ్వు, కేలరీలు, సోడియం తక్కువగా ఉంటాయి. అందువల్ల శరీరంలోని అదనపు కేలరీలు ఈజీగా తగ్గుతాయి.

🍁 బ్రెస్ట్ క్యాన్సర్ ను నయం చేస్తుంది బ్లాక్ టీలో కేంప్‌ఫెరాల్‌ అనే యాంటాక్సిడెంట్‌ ఉంటుంది. ఇది రొమ్ము కేన్సర్‌ ని అడ్డుకోవడంలో బాగా పనిచేస్తుంది. అలాగే బ్లాక్ టీలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీంతో వివిధ రకాల క్యాన్సర్ లు రావు. ఉదరం, పెద్దపేగు, ఉపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిలిపివేసే శక్తి బ్లాక్ టీకి ఉంటుంది.

🍁డయేరియా నుంచి ఉపశమనం కలిగిస్తుంది బ్లాక్ టీ లో టానిన్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో పేగులకు సంబంధించిన సమస్యలను ఇది పరిష్కరించగలదు. డయేరియా వ్యాధి గ్రస్తులు బ్లాక్ టీ తాగితే వెంటనే ఉపశమనం పొందుతారు.
🍁 బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ను తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు బ్లాక్ టీలో ఉన్నాయి. బ్లాక్ టీ, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించటంలో.సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్ డీఎల్ స్థాయిలను తగ్గించి గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ధమనుల పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది.
🍁 ఆస్తమా వేడివేడిగా ఉండే ద్రవాలను తాగటం వల్ల ఆస్తమా నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది. అయితే బ్లాక్ టీ శరీరంలోకి ఎక్కువను గాలిని పంపించి, సులభంగా ఉపిరి తీసుకునే వీలును కల్పిస్తుంది. అందువల్ల బ్లాక్ టీని తాగితే చాలా మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *