ఆపద్బాంధవుడు

కొవిడ్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ప్రాణ, ఆస్తి, ఆర్థిక నష్టాలతో మానవాళిని కకావికలం చేసింది. ఎటు చూసిన భయానక, చావు వార్తలతో ప్రపంచం ప్రాణాలు గుప్పిట పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపాయి. 140 కోట్ల జనాభా దేశమైన భారత్ పని ఖతమంటూ విదేశీలు కారుకూతలు కూశాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. దేశానికే కాకుండా ప్రపంచానికే దిక్సూచిగా నిలిచాడు. వ్యాక్సిన్ తయారీతో దేశంలో వంద కోట్ల డోసులను ఉచితంగా పంపిణీ చేస్తే.. ప్రపంచానికి ఎగుమతి చేసి దునియాకే మానసిక భరోసా కల్పించి మానవాళికి ఆపద్బాంధ వుడు’గా నిలిచాడు.

నాతెలంగాణ, సెంట్రల్ డెస్క్: కరోనా దేశాన్ని అతలాకుతలం చేసింది. ఇటు ప్రాణాలు పోతుంటే.. మరో వైపు ఆర్థిక రంగం కుదేలవుతోంది.. ఏం పాలు పోని స్థితిలో స్థితప్రజ్ఞుడి పాత్ర పోషిస్తూ.. పరిష్కారాలు చూపుతూ.. ముందుకు సాగాడు. చాలినన్ని మెడికల్మెటీరియలేక పోయినా… అప్పటికప్పుడు తయారు చేసి అవసరమైన వాటిని దిగుమతి చేసి అత్యవసర వైద్యం, ఆసరా కల్పించారు. ప్రపంచంలో ఎక్కడా వ్యా క్సిన్లు తయారు కాకున్నా.. వ్యాక్సిన్లు తయారుచేశారు.

100 కోట్ల డోసుల పంపిణీ : దేశ వ్యాప్తంగా ఫస్ట్, సెకండ్, బూస్టర్లోస్ల రూపంలో మోదీ ప్రభు త్వం అందరికీ కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసింది. ఇదంతా కూడా ఉచితంగా పంపిణీ చేసింది. దేశ ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా అందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ధృవీకరణ ప్రతం అందిస్తూ.. వారికి మానసిక, ఆరోగ్య భరోసా కల్పించారు. మాన సికంగా బలహీనమైన దేశాన్ని బలంగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు.

విదేశాలకు ఎగుమతి.. కరోనా ఫస్ట్, సెకండ్వేవ సమయాల్లో ఎక్కడ కూడా వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రారంభం కాలేదు. విదేశీ వ్యాక్సిన్ లన్నీ కూడా టెస్టింగ్ దశలో ఉం డిపోయాయి. కేంద్రం ప్రత్యేక చొరవ కారణంగా దేశంలోని ప్రముఖ

కంపెనీతో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయించారు. వీటిని మన దేశంలో పంపిణీ చేశాక.. విదేశాల అభ్యర్ధన మేరకు వారికీ ఎగుమతి చేశారు. ఇలా వారికీ మానసిక, శారీరక భరోసా కల్పిం చారు.

ఉచిత రేషన్ పంపిణీ..

దేశం ఆపత్కాలంలో ఉండగా.. పేదవారి ని ఆదుకునేందుకు మోదీ ప్రత్యేక కార్యచ రణ రూపొందించారు. వారికి అవసరమైన నెలవారి బియ్యాన్ని ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చింది. అప్పటి వరకూ వారికి ఇచ్చే కోటాకు మరింత జత చేసి పంపిణీ చేయడంతో పేదల పూట గడిచేందుకు ఇబ్బంది లేకుండా సాఫీగా సాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *