ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రానికి, ప్రజలకు లాభమా నష్టమా…….

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అదేనండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమలు చేసిన ఒకే ఒక్క పథకం ఉచిత బస్సు ప్రయాణం.
తెలంగాణ మహిళలు అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది.
రేవంత్ రెడ్డి గారు అమలు చేసిన ఈ పథకం వల్ల రాష్ట్రానికి ఏదైనా మేలు జరిగిందా?
ఈ విదంగా మారడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమా లేక తెలంగాణ ప్రజలా ?
ప్రత్యక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం కారణం పరోక్షంగా ప్రజల తప్పిదం కూడా ఉంది.

గడచిన కాలంలో తెలంగాణలో ఆర్టీసీ ఎంతో నష్టాల్లో ఉంది.
ఆసమయంలో మాజీ పోలీస్ కమిషనర్ సివి సజ్జనార్ ఆర్టిసి ఎండిగా నియమితులయ్యారు.
ఎంతో శ్రమించి తన నైపుణ్యంతో ఆర్టీసీని నష్టాలు నుండి బయటపడి నెమ్మదిగా లాభాల బాట పట్టేలా చేశారు. అంతా సర్దుకుంటున్న సమయంలో మళ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. ప్రజల ఓట్లను గెలుచుకోవడానికి రకరకాల పథకాలను అమలు చేశారు. అందులో ఈ ఉచిత బస్సు ప్రయాణం. దీనివల్ల సంవత్సరానికి సుమారుగా 14 వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతోంది. అంటే సుమారుగా ఐదు సంవత్సరాలకు గాను ఏడు వేల కోట్లు. మరి ఈ నష్టాన్ని ఎవరు భరించాలి? మన ముఖ్యమంత్రి గారు తన పర్సనల్ అకౌంట్లో ఈ నష్టాన్ని వేసుకుంటారా? లేదు కదా! మరి ఈ నష్టాన్ని ఎవరు భరించాలి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిత్యవసర వస్తువులు పై కావచ్చు, అధిక పన్నులు, కరెంటు చార్జీల రూపంలో కావచ్చు, ఎలా అయినా సరే ఈ నష్టాన్ని భరించాల్సింది తెలంగాణ ప్రజలే.. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *