విద్వేషాలను రెచ్చగొట్టి, విభజనకు దారి తీసే, అబద్ధపు రాజకీయ ప్రచారాలను ఖండించాలి.
ప్రజల విశ్వాసాలు పెట్టుబడిదారీ వర్గాలకు వంతపాడే పార్టీని ఓడించడమే లక్ష్యం కావాలి.* జాగో తెలంగాణ పేరుతో తెలంగాణ సోషల్ డెమోక్రటిక్ ఫోరం విస్తృత ప్రచారం దేశ ప్రజలందరికీ ఆచరణీయమే.
దేశ రాజకీయాలను ప్రజలు శాసించాలి కానీ ప్రజలను రాజకీయ పార్టీలు శాసించడం అలవాటు పడిన తర్వాత ప్రభువులు గా ఉండవలసిన ప్రజలు బానిసలుగా యాచకులుగా మారిన సందర్భాలను మనం గమనిస్తే గత కొన్ని దశాబ్దాలుగా దేశ రాజకీయాల గమనాన్ని అంచనా వేయడానికి ఆస్కారం ఉంటుంది. విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రజల మధ్య విభజనను రెచ్చగొట్టి అబద్ధపు హామీలు ప్రతిపాదనలతో రాజకీయాలను శాశ్వతంగా నడిపించాలని కోరుకునే కొన్ని రాజకీయ పార్టీలకు ఈ దేశంలో గుణపాఠం చెప్పకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుందని బుద్ధి జీవులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాలు ఆందోళన చెందడమే కాదు అందుకు తగిన స్థాయిలో ప్రజలను చైతన్యం చేయడంలో కూడా ముందు ఉండడాన్ని మనం గమనించవచ్చు . నవంబర్ 2023లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాగో తెలంగాణ పేరుతో కొంతమంది మేధావులు 10 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని తెలంగాణ సాధించిన పార్టీ అని పేరు చెప్పుకొని బంగారు తెలంగాణ అనే భ్రమల్లో ముంచి చేసిన ద్రోహానికి, విచ్ఛిన్నమైనటువంటి ప్రజా జీవితాన్ని, కనపడుతున్న ఆర్థిక సంక్షోభాన్ని ప్రజలకు వివరించడానికి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకండి అని చెప్పి నినదించి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అధికారంలోనికి రావడానికి తోడ్పడడమే కాదు ఆ పార్టీకి గుణపాఠం వచ్చేలాగున ప్రజల్లోకి వెళ్లిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. దేశవ్యాప్తంగా రెండు వర్గాలుగా విభజన రేఖలు గీయబడి మతం పునాదుల మీద, ప్రజల విశ్వాసాల మీద, పెట్టుబడిదారులకు వంత పాడే పద్ధతిలో కొనసాగుతున్నది ఒక వర్గం…… అది సరైనది కాదు 90% గా ఉన్నటువంటి పేద వర్గాలకు రాజ్యాధికారంలో వాటా లేదు కనుక వాటా ఇవ్వడానికి సిద్ధపడడంతో పాటు, మత ఘర్షణలు లేని, లౌకిక వాదాన్ని పెంపొందించే విధంగా ప్రస్తుతం ఉన్న రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి సుముకత వ్యక్తం చేసే మరొక వర్గం ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా పోటీపడుతున్న విషయం మనందరికీ తెలుసు. భవిష్యత్తు రాజకీయాలు ప్రజా జీవితం ఆశాజనకంగా ఉండాలన్న, అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా కొనసాగాలన్న , అమర్త్యసేన్ ఆశించినటువంటి మానవాభివృద్ధి కనీస స్థాయిలో అమలు కావాలన్నా, అంతరాలు అసమానతలు వివక్షత లేనటువంటి సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమైన ప్రస్తుత దుష్ట పరిస్థితి నుండి బయట పడాలంటే ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు దృష్టి సారించవలసిన అవసరం మాత్రం తప్పకుండా ఉంది. ఈ విషయాన్ని అభ్యుదయ వాదులు మేధావులు పరిశీలించినట్లయితే తప్ప భవిష్యత్తు శూన్యమయ్యే ప్రమాదం ఉన్నది. ఈ పరిస్థితులలో రెండు వాదాలతో ప్రజల ముందుకు వచ్చి 44 రోజులపాటు కొనసాగుతున్నటువంటి ప్రస్తుత సార్వత్రిక పార్లమెంటు ఎన్నికల సందర్భంగా దఫా దఫాలుగా జరుగుతున్న ఎన్నికలు ప్రచారాలలో తమ వాదన వినిపిస్తున్న రెండు వర్గాలను పరిశీలించి ప్రజా ఎజెండా ఉన్నటువంటి రాజకీయ కూటమిని సమర్థించడం కోసం సిద్ధపడవలసిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సోషల్ డెమోక్రటిక్ ఫోరం పేరుతో ఏర్పడి జాగో తెలంగాణ పేరుతో చైతన్యం చేస్తున్నటువంటి వ్యవస్థ సంస్థ చేసిన కొన్ని సూచనలు హెచ్చరికలు ఎన్నికల సందర్భంగా ప్రజలను చైతన్యం చేయడానికి చాలా తోడ్పడతాయని ఆశించి ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి ప్రయత్నం చేయడమే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం.
జాగో తెలంగాణ చేసే హెచ్చరికలు ఏమిటి :-
**““
-రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రభుత్వాలను పడగొట్టినటువంటి రాజకీయ పార్టీని కూటమిని ఓడించాలని పిలుపు ఇవ్వడంతో పాటు రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను అపహాస్యం చేస్తూ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతామని బహిరంగంగా ప్రకటన చేసినటువంటి పార్టీని తరిమి కొట్టాలని పిలిపివ్వడం గమనించవచ్చు.
— గత పది ఏళ్ల క్రితం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని అధికారానికి వచ్చిన ప్రభుత్వం హామీని మరిచి ప్రజల విశ్వాసాల పునాదుల మీద పనిచేయడంతో పాటు యూపీఏ హయాంలో అమలులోనికి వచ్చిన 100 రోజుల కరువు పనికి సంబంధించినటువంటి బడ్జెట్‌ను క్రమంగా తగ్గిస్తూ పేద వర్గాల పో ట్టగొడుతున్నటువంటి విధానాన్ని ఎండగట్టాలని పిలుపు ఇవ్వడం హర్షనీయం.
— సుమారు 75 కోట్ల బీసీలకు సంబంధించి కుల గణన లేక సుప్రీంకోర్టు ప్రశ్నించినా ప్రధాని ఆమోదించక ప్రభుత్వం పదేళ్లలో పక్కదారి పట్టించి చేసిన బీసీ ద్రోహాన్ని వ్యతిరేకించి అనుకూలమైన పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది.
— ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నాయకులను సిబిఐ ఐటి ఈడి సంస్థలతో బెదిరించి తమ పార్టీలో చేరగానే కేసులను మాఫీ చేసిన దుర్నీతిని ఎండ కట్టాలి . అణచివేత దోపిడికి గురైన వర్గాల రిజర్వేషన్లను కొల్లగొట్టడానికి, దేశానికి వెన్నెముక లాంటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఇష్టపడని, స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయని ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపు ఇవ్వడం గమనార్హం.
— 10 శాతం ఆదిపత్య కులాలలో రెండు శాతం పేద వర్గాలు ఉంటే 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చి 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేవలం 27%తోనే సరిపెట్టి వారి రాజకీయ అధికారాన్ని అడ్డుకున్న పార్టీని ఓడించకపోతే ఎలా ?
–దళితుల పేద వర్గాల అభివృద్ధికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు క్రమంగా తగ్గిస్తూ ఓడరేవులు, విమానాశ్రయాలు, బొగ్గు గనులు, బీమా సంస్థలు వంటి వందలాది ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఆదాని అంబానీలకు కట్టబెడుతున్న పార్టీని ప్రశ్నించకపోతే ఎలా?
— దేశవ్యాప్తంగా పేదలు అట్టడుగు వర్గాలపైన అకృత్యాలు అత్యాచారాలు జరిగిన స్పందించలేదు పైగా మణిపూర్ లాంటి రాష్ట్రాలలో మహిళలపై అత్యాచారాలు జరిపి నగ్నంగా వీధులలో ఊరేగించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపకపోవడం నేరం కాదా? అలాంటి పార్టీని ఎలా అంగీకరిస్తాం ?
-బడా పెట్టుబడిదారులు కంపెనీలకు కేంద్రం 16 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేసి చిరు వ్యాపారులు, రైతులు, పేద వర్గాలకు ఎలాంటి సహకారం అందించని రాజకీయ పార్టీ ఇంకా ఈ దేశాన్ని పాలిస్తే ఏ వర్గం బాగుపడుతుందో తెలుసుకోవాలి .
— 40 శాతం సంపద 1 శాతం సంపన్న వర్గాల చేతిలో నిక్షిప్తమై ఉంటే అసమానతలు అంతరాలు ఆకాశానికి భూమికి ఉన్న తేడాతో విలసిల్లుతుంటే ఈ పాలన మనకు అవసరమా? ఈ పార్టీ ప్రయోజనం ముఖ్యమా?
- ప్రతి ప్రశ్నకు రామాలయ నిర్మాణం చారిత్రాత్మకమని విదేశాల సంబంధాలు గొప్పగా ఉన్నాయని చెప్పుకోవడంతో సరిపెట్టడం క్రింది స్థాయి కార్యకర్త వరకు కొనసాగుతుంటే ఇదేనా పరిపాలన అని ప్రజలు ఇకనైనా ప్రశ్నించకపోతే నిజమైన ప్రజా ఎజెండా పరిపాలనలోకి రాదు. 90 శాతం ఉన్న పేద వర్గాలకు 6 శాతం సంపద కూడా బడ్జెట్లో కేటాయించడం లేదని అమలు చేయడం లేదని గణాంకాలు చెబుతుంటే ఇంకానా ఈ ప్రభుత్వం ఇకపై సాగకూడదు అని ప్రశ్నిస్తే తప్పేమిటి ఆ పార్టీని నిలదీస్తే పోయేదేమిటి?
చైతన్యవంతమైన ఆలోచన చేయకుండా మొక్కుబడిగా కొనసాగితే నిర్జీవి తో సమానమే ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించి, మనవాభివృద్ధిని సాధించే వైపుగా ఎజెండా కలిగినటువంటి రాజకీయ పార్టీని ఆ కూటమిని సమర్థించి గెలిపించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తిని హక్కులను పరిరక్షించుకోవడం మనందరి తక్షణ కర్తవ్యం కావాలి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ ) - ఎన్నికలు- భిన్న రూపాలలో ప్రజా నిరసనలు.* ప్రజలను తక్కువగా అంచనా వేస్తున్న పాలకులు.* పాలకులపై భ్రమలతో కర్తవ్యాన్ని విస్మరిస్తున్న ప్రజా సమూహాలు .*
- పాలనపైన పాలకులు దృష్టి సారించడం లేదు. డిమాండ్ల సాధనకు ప్రజలు ఐక్య ఉద్యమాలకు సిద్ధంగా లేరు .*
- భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడమే మన కర్తవ్యం.
- — వడ్డేపల్లి మల్లేశం 9014206412
- —09…05…2024***
- ఎన్నికల సందర్భంగా ప్రతిసారి ఏదో ఒక మూలన ప్రజలు బహిష్కరించడం కొన్నిచోట్ల కార్యకర్తలు నిరసనగా ఈవీఎంలను ధ్వంసం చేయడం , వైరి వర్గాల మధ్యన ఘర్షణ చెలరేగడం, కేసులను బనాయించి ఎన్నికల సంఘం పోలీసులు సందర్భోచితంగా తమ బాధ్యత నిర్వహించినట్లుగా ప్రచారం చేసుకోవడం వంటి కార్యక్రమాలతో ఎన్నికల నిర్వహణ కొనసాగుతున్నది. కొన్ని గ్రామాలకు సంబంధించి లేదా ప్రజా సమూహాలకు సంబంధించి ప్రధాన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైన సందర్భంలో అనివార్యంగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం వంటి చైతన్యాన్ని కూడా మనం అక్కడక్కడ గమనించవచ్చు. ప్రజలను ప్రభువులు గా చూడవలసినటువంటి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు భ్రమల్లోకి తీసుకువెళ్లి ఉచితాలు ప్రలోభాలతో ముంచెత్తి చైతన్యం కాకుండా చూసే ప్రయత్నం ఒకవైపు కొనసాగుతుంటే మరికొన్ని రాజకీయ పార్టీలు ప్రజా అంశాలను పక్కనపెట్టి ప్రజల విశ్వాసాల పునాదిగా నమ్మించే ప్రయత్నం చేయడం ద్వారా ప్రజా ఎజెండా పక్కకు పోతున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు . ప్రజలు తమకున్న ఆకాంక్షలు డిమాండ్లను రాజకీయ పార్టీల ముందు పెట్టే అవకాశం రాకపోవడం రాజకీయ పార్టీలు నిర్ణయించుకున్న మేనిఫెస్టో ప్రకారంగా ప్రజలను ప్రభావితం చేస్తూ ధన ప్రవాహం, మధ్యంలో ప్రశ్నించకుండా చేయడం ఇదే ఎన్నికల హంగామా పండుగ అనే పరిస్థితిలో ఎన్నికల ప్రచార యాత్రలు, కోలాహలం కొనసాగుతుండడంతో తాత్కాలిక ప్రయోజనాలకు ఇచ్చిన స్థానాన్ని శాశ్వత ప్రజల అవసరాలు డిమాండ్లకు ఇవ్వకపోవడం జరుగుతున్నది. ఎన్నికలకు ప్రత్యేక యంత్రాంగము, ఎన్నికల కోడ్, పోలీసు బలగాలు, న్యాయవ్యవస్థ ఉన్నప్పటికీ ఇదంతా ఒక ప్రహసనంగానే మారిపోవడాన్ని మనం గమనించవచ్చు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, ప్రజల అవసరాలను తీర్చడానికి, రాజ్యాంగబద్ధమైన హక్కులను ప్రజలకు సాధించి పెట్టడానికి పాలకులు సమన్వయకర్తలుగా కార్యకర్తలుగా సేవకులుగా పనిచేయాలని చట్టం నిర్దేశిస్తుంటే ప్రజలు తమకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులను సాధించుకోవడానికి రాజకీయ పార్టీలను శాసించే బదులు ఆశించే స్థాయిలో ఉండడంతో ప్రజా డిమాండ్ లు నీరుగారిపోతున్నవి. ఈ అవకాశాన్ని తీసుకున్నటువంటి రాజకీయ పార్టీలు అక్రమంగా సంపాదించినటువంటి కోట్లాది రూపాయల డబ్బును ఎన్నికల్లో కుమ్మరించడం డబ్బున్న వాళ్లు ఆధిపత్య వర్గాలకే ఎన్నికల్లో టికెట్లను కేటాయించడంతో 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు రాజ్యాధికారానికి దూరంగా ఉండవలసి వస్తున్నది .ఈ విషయాన్ని స్వయంగా ఇటీవల భారత్ జోడోయాత్ర సందర్భంగా ఎన్నికల సభల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేస్తూ తమ పాలన వస్తే ఆ వర్గాలకు రాజ్యాధికారంలో వాటా కల్పిస్తామని బీసీ కుల గణన జరిపించి ఆ వర్గ ప్రయోజనాల కోసం పథకాలను ప్రవేశపెడతామని చేసినటువంటి ప్రకటన ఆ వర్గాలు ఎంత నష్టపోతున్నాయో కనీసం గానైనా మనం అర్థం చేసుకోవడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది.
- ఉద్యోగ ఉపాధి హామీలను పక్కనపెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు పెట్టుబడిదారులు భూస్వాములకు ధారాధత్తం చేస్తూ సంపన్న వర్గాలు అప్పు పడి ఉంటే ఆ బకాయిలను మాఫీ చేయడంతో ప్రభుత్వం పెట్టుబడిదారులకు మాత్రమే దోహదపడుతూ చిరు వ్యాపారులు చేతివృత్తుల వాళ్ళు పేదలు, రైతులకు ఎలాంటి సహాయం చేయకపోగా ఆ వర్గాలపైన అణచివేత దాడులు ముమ్మరం చేస్తున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు . అల్పాదాయ వర్గాలకు విద్యా వైద్యం సామాజిక న్యాయాన్ని ఏనాడు కూడా ఏ రాజకీయ పార్టీ గ్యారెంటీ ఇచ్చిన సందర్భం లేదు. కాబట్టే పేద వర్గాలు పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రైవేటీకరణ బలంగా సాగిన నేపథ్యంలో తమ ఆదాయంలో 60 నుండి 70 శాతం విద్య వైద్యానికే ఖర్చు చేస్తున్న కారణంగా పేదలు మరీ పేదలుగా మారిపోతున్నారు. ఈ ప్రధానమైన అంశాలను ఎన్నికల సందర్భంలో ప్రజలు పాలకులను డిమాండ్ చేయడం లేదు, రాజకీయ పార్టీలను ప్రశ్నించడం లేదు, అభ్యర్థులను నిలదీయడం లేదు. తాత్కాలికంగా కొనసాగుతున్న సభలు సమావేశాలు రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లతోనే గడిచిపోతుంటే ఎవరిని ప్రశ్నించాలో ఎవరికీ తమ డిమాండ్లను చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో పేజీల కొద్దీ మ్యానిఫెస్టోలను మాత్రం రాజకీయ పార్టీలు ప్రకటించి పత్రికల్లో ప్రచురిస్తూ ఉంటే ఇదంతా నటన అని బూటకమని కేవలం కల్పిత నాటకం అని ప్రజలకు తెలుసు . అయితే ప్రజలు కూడా రాజకీయ పార్టీల యొక్క విభజన విద్వేషపూరిత రాజకీయ ప్రచారాల మధ్యన ఊగిసలాడుతూ తమకంటూ ఒక అభిప్రాయాన్ని కూడగట్టుకోలేక ఊగిసలాట మనస్తత్వంతో ఊరేగుతుంటే ప్రజలు ఓటమి పాలు కాక మరేమవుతారు? ఇదే అదను గా భావిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజలను బానిసలుగా మార్చుకొని యాచకులుగా చేసుకొని పాలకులను యాచించే పరిస్థితి కల్పించినప్పుడు ప్రజలు పాలకులను ఎలా శాసించగలుగుతారు? రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించుకోనప్పుడు, ఓటు హక్కు ద్వారా తన నిర్ణయక శక్తిని ఓటరు రుజువు చేయలేనప్పుడు ఓటు హక్కు కేవలం ఒక బ్రాంతిగా మాత్రమే మిగిలిపోతున్నది. పేరుకు మాత్రం ప్రధానికి సామాన్యుడికి ఒకటే ఓటు హక్కు అని నమ్మబలికే ప్రయత్నం చేస్తే ఆ భ్రమల్లో సామాన్యుడు తేలిపోతే ప్రజా జీవితం ఇంతకంటే ఉన్నతంగా ఉంటుందను కోవడం అత్యాశే అవుతుంది .
- ప్రజల నిరసనలను గమనించినప్పుడు ఎన్నికలను బహిష్కరించిన సందర్భాలను ఆలోచించనప్పుడు ఎన్నికల కేంద్రాల్లో జరుగుతున్నటువంటి దాడిని గమనించినప్పుడు ఇక రాజకీయ పార్టీలు ప్రజల యొక్క ఆగ్రహానికి కారణాలను వెతకనట్టే కదా ! అలాంటప్పుడు ప్రజల యొక్క నిరసన ,ఆకలి, అనుభవాలు, బాధలు, వెతలు , కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు, డిమాండ్లను ఆలోచించే బాధ్యత రాజకీయ పార్టీలకు ఎక్కడిది? తీరిక లేకుండా తిరుగుతున్నారే తప్ప ప్రజల సమస్యల మీద దృష్టి సారించడం లేదు ప్రజల కోసమే తాము ఉన్నామని ఆలోచించడం లేదు. ప్రజా సమస్యలే తమ ఎజెండా అని అంగీకరించడం లేదు . అధికారానికి వచ్చిన తర్వాత విధానపరమైన ప్రకటనల ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించాలని అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించాలనే సోయి పాలకుల కు లేకపోవడం వలన ఎన్నికల నిర్వహణ వరకు తమ బాధ్యత నిర్వర్తించేటువంటి ఎన్నికల సంఘం న్యాయవ్యవస్థ ఆ తర్వాత ఆ ప్ర హసనాన్ని రాజ్యాధికారానికి రాజకీయ పార్టీలకు అప్పజెప్పడంతో మళ్లీ ఐదేళ్ల వరకు రాజకీయ పార్టీలది ఆడినదే ఆట పాడిన పాట అన్నట్లుగా చలామనవుతున్నది . ప్రజల నిరసనలు , ప్రజా వ్యతిరేక కార్యక్రమాల పైన ప్రజల పోరాటాలు, హక్కుల కోసం సాగే ఉద్యమాలు, ఉమ్మడిగా కాకుండా విడివిడిగా సాగడం ప్రైవేటీకరణ విచ్చలవిడిగా దేశంలో కొనసాగుతున్న పట్టించుకోకపోవడం, సంవత్సరాలుగా సాగిన రైతు ఉద్యమాలు కూడా నీ రుగారిపోవడం, వందలాది మంది రైతులు కాల్పుల్లో చనిపోవడం తప్ప ప్రజా చైతన్యాన్ని రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఏనాడైనా అంచనా వేసినాయా? ప్రతిఘటన, ఉద్యమాలు ప్రజల యొక్క హక్కులు అని అంగీకరించినాయా? అలాంటి పరిస్థితి లేదు . ప్రభుత్వం మారితే ఆలోచన మారుతుంది ఆలోచన మారితే విధానపరమైన మార్పులు సాధ్యమవుతాయి. ఆ సందర్భంలో ఊహించినటువంటి మార్పులు సంభవిస్తాయి, సమ సమాజం సాధ్యమవుతుంది, సమానత్వం అంతరాలు లేని వ్యవస్థ ఆవిష్కృతం అవుతుంది అని ఇప్పటికీ ఈ దేశంలో ఆశించే వాళ్ళు కోట్లాదిమంది ఉన్నారు . ప్రజాధనాన్ని ప్రజల కోసమే ఖర్చు పెట్టకుండా 90% ప్రజలకు కేవలం 6 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు మిగతా సంపదంత పెట్టుబడిదారీ భూస్వామ్య ఉన్నత వర్గాలకే ఖర్చు చేస్తున్నట్టుగా గణాంకాలు తెలియజేస్తుంటే సంపద కేంద్రీకరణ చట్టబద్ధం కాదు, దానిని నిరసించాలి అని ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు నిరంతరం ఘోషిస్తుంటే పాలకుల పుణ్యమా అని గత 77 ఏళ్లలో ఇటీవలి 10 ఏళ్లలో పెట్టుబడిదారుల యొక్క సంపద ఏ రకంగా రెట్టింపు అవుతున్నదో ప్రపంచ కుబేర్ల స్థాయికి మన దేశస్తులు చేరుకోవడానికి తొలి స్థానం సంపాదించడానికి ఎలా ఆరాటపడుతున్నారో అర్థం చేసుకుంటే ఇక ఇతర దేశాలలో దాగివున్న నల్ల డబ్బు మన దేశానికి తెస్తామని ఇచ్చిన హామీ భ్రమల్లో ప్రజలు ఉంటే ప్రతి ఖాతాలో 15 లక్షల జమ చేస్తామని ఇచ్చిన మాట కల్ల కాక మరేం అవుతుంది? ఇంత జరుగుతున్న ఇచ్చిన హామీలు విస్మరిస్తున్న , వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న పాలకుల కోసం పెట్టుబడిదారుల కోసం సంపన్న వర్గాల కోసం పనిచేస్తున్న ప్రజలు తమ భ్రమల్లోనే మునిగిపోతే వారిని రక్షించేది ఎవరు? అందుకే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించి భంగపడితే ప్రయోజనం లేదు అవసరమైన సందర్భంలో ఎన్నికలవేళ ఉద్యమాల సమయంలో కర్తవ్యంతో ఉమ్మడి ఉద్యమాలను నిర్వహించినప్పుడు మాత్రమే ఎంతో కొంత ప్రయోజనం సాధ్యమవుతుంది. ఐదేళ్లకోసారి పాలకులు రాజకీయ పార్టీలు ప్రజల దగ్గరికి వస్తున్నాయి అప్పుడే జుట్టు పట్టుకొని మెడలు వంచి నిలదీసి అడగాలి ఆ సందర్భం దాటిపోయిందా! వాళ్ల అవసరం నీతోనే ఓటు ద్వారా తీరిపోయిందా! నీకు మళ్ళీ కనపడితే ఒట్టు అందుకే తన నియంతృత్వాన్ని నిరంకుశత్వాన్ని ఆధిపత్యాన్ని అహంకారాన్ని శాసించే స్థాయిలో చలామణి చేస్తుంటే సామాన్యుల పైన సా రీ చేస్తూ బానిసలుగా తయారు చేస్తుంటే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి అడపా దడపా డబ్బు మధ్యాన్ని ఎరగా చూపి నిన్ను బలహీనుడు, అత్యాశపరుడు, లోబి అని నిందిస్తుంటే ఇంకెంతకాలం అంగీకరించడానికి సిద్ధంగా ఉందాం ? అంబేద్కర్, మార్క్స్ ఆర్థిక వేత్తలు ఎవరు చెప్పినా ఈ దేశ సంపద ప్రజలందరికీ చెందాలని, ఈ దేశ అధికారం అన్ని వర్గాలకు దక్కాలని, సామాజిక న్యాయం జరగాలని, అన్ని సామాజిక వర్గాలకు వారి వారి వాటా ప్రకారం ఫలాలు అందాలని కోరుకోవడమే.
- ఏ వర్గం వాళ్లు అధికారానికి వస్తే తమ వర్గాన్ని మాత్రమే పెంచి పోషించుకుంటూ మిగతా పేద వర్గాలను సామాజిక వర్గాలను ఇప్పటివరకు అధికారాన్ని చూడని కడప దాటని వర్గాలకు మాత్రం మొండి చేయి చూపుతూ అభ్యర్థులుగా నిలబెట్టడంలో కానీ నామినేటెడ్ పోస్టులను ఇవ్వడంలో గాని రాజకీయ కార్యకర్తగా నైనా కనీసం అంగీకరించడానికి మనసొప్పక నచ్చితే మా వెంట రా అధికారం మాత్రం మాదే మీరు మా జెండాలు మోయాలి, బ్యానర్లు కట్టాలి, మా వెంట ఉండాలి, మా అధికారాన్ని అంగీకరించాలి అనే విధంగా ఈనాడు దేశంలో పాలన కొనసాగుతున్నది. ఈ పాలనకు చరమగీతం పాడాలి ప్రజాస్వామ్యాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలి. ఇందుకు ఎన్నికల సంఘం నడుం బిగించాలి, న్యాయవ్యవస్థ ఉక్కు పాదం మోపాలి ,ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున రావాలి . మేధావులు బుద్ధి జీవులు ప్రజాస్వామ్యవాదుల ఆలోచనకు పాలకులే ప్రాధాన్యత ఇచ్చే రోజులు రావాలి ఆ స్థాయిలో ప్రజల ఒత్తిడి పాలకుల పైన కొనసాగాలి . అన్యాయాన్ని ప్రతిఘ టించేవాళ్లు, స్థానికంగా ఉన్న తమ సమస్యల పైన పోరాడే వాళ్ళు, ఆదిమ జాతులు , భూముల కోసం ఇళ్ల స్థలాల కోసం కనీస హక్కుల కోసం ఉనికి కోసం ఉద్యమాలు చేస్తున్న వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. కానీ వారి సంఖ్య చాలా తక్కువ వారికి నాయకత్వం వహించేవాళ్లు వారిని మనిషిగా చూసేవాళ్ళు వాళ్ల సమస్యలను నిజంగా డిమాండ్లు అని అంగీకరించే వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే అలాంటి ఉద్యమాలు తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. చిన్న నిప్పు రవ్వ వ్యాపించి అడవులను దహించి వేసినట్లుగా స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలు కూడా డిమాండ్ల రూపంలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పాలకుల దృష్టికి ఒత్తిడి ద్వారా తీసుకు రాగలిగితే ఉద్యమాల రూపంలో బహిర్గతమైతే ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలు అన్నట్లుగా పాలకుల మెడలు వంచి మన హక్కులను సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు కాదు ప్రజలే పాలకుల మెడలు వంచాలి ఆ రోజులు రావాలి అందుకు ఎన్నికలు ఎన్నికల సందర్భంగా వచ్చిన ప్రజా చైతన్యము, సామాజిక చైతన్యము, మేధావులు బుద్ధి జీవుల యొక్క ఆలోచన సరళి, ప్రజల కడగండ్లు కన్నీరు అసమానతలు అంతరాలు వివక్షత ఉద్యమ తీవ్రతకు తోడ్పడతాయని ఆ వైపుగా అసంఘటిత రంగంలో ఎక్కడికక్కడ అవమానాలు ఇబ్బందులు ఆందోళనల పాలైనటువంటి ప్రజలు కార్యోన్ముఖులై కర్తవ్యం వైపు దృష్టి సారిస్తే తప్పకుండా విజయం మనదే. ఆ వైపుగా కృషి జరిగిన నాడు విద్య, వైద్యము, సామాజిక న్యాయం, ఉపాధి ,ఉద్యోగాల కల్పనతో అంతరాలు, ఆర్థిక సంక్షోభం నుండి ఈ దేశాన్ని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది . రాజ్యాధికారంలో వాటా పొందడానికి వీలు చిక్కుతుంది. అప్పుడే సామాజిక న్యాయం సాధించినట్లు సామాజిక న్యాయం సాధిస్తేనే నిజమైన సుపరిపాలన ఈ దేశ ప్రజలకు అందించినట్లు లెక్క .
- ( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )