ఓటు అంటే ఏంటి అది ఎవరి చేతుల్లో ఉండాలి.
జైహింద్ జై భారత్ మినిమం 10వ తరగతి అంతకు మించి చదివిన విద్యావంతులు తెలివైన వారితో నాకు వున్న ఒక డౌట్ క్లారిటీ చేసుకోవాలి మనకు ఊహ రాక ముందు నుండి అంటే 6 సంవత్సరాల నుండి ప్రతి రోజు ఉదయాన్నే స్కూల్ ల్లో ప్రతిజ్ఞ చేస్తాం. ఆ ప్రతిజ్ఞ చేసిన విదంగా ఎంతమంది దేశంకోసం దేశ అభివృద్ధి కోసం ఓటు వేస్తున్నాం. చీపుగా మందుకోసమో, డబ్బుకోసమో, కులముకోసమో, ఇంకా చీపుగా పార్టీ అంటుంటారు కొందరు. మీకోసం మీరు అలాగే దేశం కోసం ఎప్పుడు ఆలోచిస్తారు. మనం విద్యావంతులమే కదా? ఆలోచించండి ఈసారి మీరు వేసే ఓటు మీరు విద్యావంతులు వివేకవంతులు అని గుర్తించేలాగా ఉండాలి చూదాం ఎంతమంది తను చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటారో. జైహింద్ జైభారత్.