సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు

సోషల్ మీడియా. ఈ పదం అన్ని దేశాల్లో పట్నాల నుంచి పల్లెలు వరకు వ్యాప్తి చెందిన మాధ్యమం. ఈ రోజుల్లో న్యూస్ పేపర్ చదివేవాళ్ళకంటే సోషల్ మీడియాలో సర్ఫింగ్ చేసే వాళ్ళే ఎక్కువ.

కాని ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ప్రబలుతున్న అతి పెద్ద సమస్య తప్పుడు వార్తలు (Fake News). ఇది facebook, ట్విట్టర్ లాంటి ప్రముఖ సోషల్ మీడియా websites లోనే కాకుండా youtube లో ఎన్నో వీడియోలలో కూడా కనిపిస్తూ వుంటుంది.

ప్రముఖంగా తప్పుడు వార్తలు ఛానల్ వీక్షకుల సంఖ్య పెంచుకోవడం కోసం తప్పుడు వార్తలు వ్యాప్తి చేసేవారు ముఖ్యంగా కనిపిస్తుంటారు.

ఈ సమస్య యొక్క తీవ్రత ఎంత పెద్దది అంటే ఎన్నో తీవ్రవాద సంస్థలు తప్పుడు సమాచారం ఉపయోగించి, అమాయకులైన యువకులని మభ్యపెట్టి

వాళ్ళ సంస్థల్లో చేరేలా సోషల్ మీడియాని ఒక మాధ్యమంగా ఉపయోగిస్తున్నారు ఈ రోజుల్లో.

రాజకీయ పార్టీలు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్న సంగటనలు ఎన్నో చూసాం మనం.

ఇలాంటి సంగటనలు వల్ల జనాలకి ఏది నిజమైన వార్తో ఏది తప్పుడు వార్తో తెలియడం అత్యంత కష్టంగా మారింది.

దీని ద్వారా జరిగే ఇంకో నష్టం ఏమిటి ఏంటంటే ప్రజలకి బడ్జెట్లో కేటాయించిన డబ్బుని సరిగ్గా వాడుతున్నార లేదా తప్పుడు లెక్కలు జనాలకి వెళుతున్నాయ అని తెలుసుకోవడం కూడా కష్టమే.
 
అలాగే దీని వల్ల వచ్చే విపరీతమైన సమస్య ఏమిటి అంటే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో నిజమైన వార్త పెట్టిన, జనాలు అది తప్పు అని నమ్మే అవకాసం వుంది.
సోషల్ మీడియా ద్వారా అమాయకులైన వ్యక్తుల మీద తప్పుడు ప్రచారం చేసి వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని మానసిక క్షోభకు గురి చెయ్యటం లాంటివి చాల కనిపిస్తున్నాయి.
 
ఇలాంటి సమస్యలు కొనసాగితే సమాజానికే కాదు దేశానికి కూడా కోలుకోలేని ముప్పు వాటిల్లే అవకాశం వుంది.
 
ఇటువంటి సమస్య రూపమపటానికి ఒక ప్రత్యేకమైన నియంత్రణ సంస్థ ఏర్పాటు చేసి, కొత్త చట్టాలకి నాంది పలకడం ఎంతో ముఖ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు