BRS Manifesto : బీఆర్ఎస్ పూర్తి మేనిఫెస్టో ఇదే..

  • ఆసరా పెన్షన్లు దశల వారీగా ₹5016 కి పెంపు – అయితే తొలి సంవత్సరంలో ₹3016, ప్రతి ఏటా 500 చొప్పున పెంచుకుంటూ ఐదేళ్లలో ₹5016 రూపాయలు ఇవ్వనున్నారు. ఇక కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన మేనిఫెస్టోలో అన్ని సామాజిక వర్గాల వారికి ఒకేసారి 4 వేల రూపాయలకి పెన్షన్ పెంచనున్న విషయం తెలిసిందే.
  • దివ్యాంగులకు మాత్రం 6000 వరకు దశలవారీగా పెంచుతూ, తొలి ఏడాది 5వేల రూపాయలకు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
  • సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల 3000 చొప్పున భృతి.
  • అర్హులైన పేదలతో పాటు అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకు ₹400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు BRS తెలిపింది.
  • ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కేసిఆర్ ఆరోగ్య రక్ష పేరుతో 15 లక్షల వరకు ఆరోగ్య బీమా.
  • తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల అందరికీ సన్న బియ్యం.
  • రైతుబంధు సహాయాన్ని 16 వేలకు దశల వారీగా పెంచనున్నట్లు, తొలి ఏడాది సహాయాన్ని 12 వేల వరకు పెంచనున్నట్లు బిఆర్ఎస్ ప్రకటించింది.
  • కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బీమా తరహాలో ఎల్ఎసి ద్వారా 5 లక్షల జీవిత బీమా వర్తింప చేయనున్నట్లు బిఆర్ఎస్ ప్రకటించింది. దాదాపు 93 లక్షల కుటుంబాలకు దీని ద్వారా లబ్ధి చేకూరనుంది.
  • ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షలకు పెంచుతూ నిర్ణయం.
  • దళిత బంధు రైతు బీమా కొనసాగింపు ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు.
  • లంబాడి తండాలు, గోండుగూడెంలను పంచాయతీలుగా మార్చనున్నట్లు BRS తెలిపింది.
  • మహిళా సంఘాలకు స్వశక్తి భవనాలు, అగ్రవర్ణాల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల
  • రాష్ట్రంలోని అనాధల కోసం ప్రత్యేక పాలసీ
  • ప్రభుత్వ ఉద్యోగుల ఓపిఎస్ కోసం కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు BRS తెలిపింది.

One thought on “BRS Manifesto : బీఆర్ఎస్ పూర్తి మేనిఫెస్టో ఇదే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *